Breaking News

వార్డు సభ్యుడు గెలవలేని దిలీప్ నీవా

..ఎమ్మెల్సీ కుటుంబ సభ్యులపై తప్పుడు ఆరోపణలు చేస్తే తోలు తీస్తాం

సామాజిక సారధి , నాగర్ కర్నూల్ బ్యూరో : ప్రత్యక్ష రాజకీయాల్లో గ్రామీణ ప్రాంతాలలో కూడా వార్డు సభ్యుడిగా గెలవలేని బిజెపి నాయకుడు దిలీపాచారి ఎమ్మెల్సీ కుటుంబ సభ్యులపై తప్పుడు ఆరోపణలు చేస్తే తోలు తీస్తామని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు హబీబ్ , జిల్లా కాంగ్రెస్ నాయకులు ఇంద్రకల్ వెంకటన్న తీవ్రంగా హెచ్చరించారు . బుధవారం రోజు బిజెపి నాయకుడిగా చెప్పుకుంటున్న దిలీప్ ఆచారి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి పై నాగర్ కర్నూల్ కాంగ్రెస్ టికెట్ కొరకు రాజ్ పుష్పా లో 12 కోట్లు విలువ చేసే నాలుగు విల్లాలను పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి రిజిస్ట్రేషన్ చేశారని అసత్యపు ఆరోపణలు చేసి రాజకీయ పబ్బం గడుపుకుంటామంటే ఇక్కడి కాంగ్రెస్ నాయకులు సహించరని అన్నారు . గత ఎన్నికలలో నాగర్ కర్నూల్ బిజెపి అభ్యర్థిగా పోటీలో ఉండి పోలింగ్కు రెండు రోజుల ముందు టిఆర్ఎస్ పార్టీ నేతైన మర్రి జనార్దన్ రెడ్డితో కమిషన్లు తీసుకొని ఇక్కడి కార్యకర్తలకు ఫోన్లు ఎత్తకుండా స్విచ్ ఆఫ్ లు పెట్టుకొని ఎన్ని కోట్లకు అమ్ముడు పోయావు … ఇక్కడి ప్రతి కార్యకర్తలకు తెలుసునని ఆరోపించారు . కాంగ్రెస్ పార్టీ టికెట్ల కొరకు డబ్బులు ఆశించదని గుర్తుంచుకోవాలని తెలిపారు . నాగర్ కర్నూల్ చుట్టు ప్రాంతంలో బిజెపి నాయకుడిగా ఉంటూ బిఆర్ఎస్ నేతలతో నీవు రియల్ ఎస్టేట్ వ్యాపారా లో నీ వాటా పెట్టి చేస్తున్నది నిజం కాదా … ఏదైనా ఇతరుల మీద ఆరోపణలు చేసే ముందు నీ స్థాయి తెలుసుకో , పట్టుమని పదిమంది కార్యకర్తలు కూడా నిన్ను ఆదరించరు .. పోటీ చేసి డిపాజిట్ కూడా దక్కించుకోలేని నీవు ఎమ్మెల్సీ కుటుంబాన్ని విమర్శించే స్థాయి నీకు ఎక్కడిదని , వారి కుటుంబం పై విమర్శలు చేయాలని నీకు బీఆర్ఎస్ నేతలు ఎంత కమిషన్ ఇచ్చారో తెలుస్తుందని అన్నారు . కాంగ్రెస్ పార్టీ గురించి మరో మారు , ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కుటుంబం పై అసత్యపు ఆరోపణలు చేశావంటే ఇక నీ మాఫియా బాగోతం , కమిషన్ల బాగోతం ప్రతి గ్రామంలో మా కార్యకర్తల ఆగ్రహంతో చెలరేగిపోక ముందుకే నీవు చేసిన ఆరోపణలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు .