సారథి, ఖమ్మం: కరోనా ఉధృతి నేపథ్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాలో కొనసాగుతున్న లాక్ డౌన్ అమలుతీరుపై ఆయా జిల్లాల ఎస్పీలతో వరంగల్, కరీంనగర్ రేంజ్ డీఐజీ ప్రమోద్ కుమార్ శుక్రవారం ఖమ్మం పోలీస్ కమిషనర్ ఆఫీసులో సమీక్షించారు. రాష్ట్ర సరిహద్దు అంతర్గత రహదారుల చెక్ పోస్టుల్లో అమలవుతున్న లాక్ డౌన్ తీరును అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్ తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్, ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, మహబూబాబాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి పాల్గొన్నారు.
- May 28, 2021
- Archive
- ఖమ్మం
- లోకల్ న్యూస్
- వరంగల్
- dig pramodkumar
- KHAMMAM
- LOCKDOWN
- MULUGU
- ఖమ్మం
- డీఐజీ ప్రమోద్ కుమార్
- ములుగు
- లాక్ డౌన్
- Comments Off on లాక్ డౌన్ పై డీఐజీ సమీక్ష