Breaking News

ప్రజలకు పారదర్శకంగా ధరణి సేవలు

ప్రజలకు పారదర్శకంగా ధరణి సేవలు

సారథి, మానవపాడు: ధరణి సేవలను ప్రజలకు అందుబాటులో పారదర్శకంగా అందించాలని జోగుళాంబ గద్వాల జిల్లా ఈడీఎం ఫారూఖ్ సూచించారు. గురువారం మానవపాడు మండల కేంద్రంలోని మీసేవ సెంటర్లను ఆయన పరిశీలించారు. మీసేవ ద్వారా అందించే కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు రైతులకు అందించే సేవలకు అధిక రేట్లు తీసుకోకుండా ప్రభుత్వం సేవలు అందించాలని సూచించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కూడా పారదర్శకత పాటించాలని ఆదేశించారు. అనంతరం మానపాడు తహసీల్దార్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించి అక్కడ రైతులకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్​వరలక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్ రవికుమార్, సీనియర్ అసిస్టెంట్ తదితరులు ఉన్నారు.