Breaking News

డీల్​ రూ.100 కోట్లు?

డీల్​ రూ.100 కోట్లు?
  • ట్రాప్​లో నలుగురు టీఆర్ఎస్​ఎమ్మెల్యేలు
  • మెయినాబాద్, అజీజ్​నగర్​ఫాంహౌస్ లో ఢిల్లీ దూతలు
  • ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, బీరం హర్షవర్దన్​రెడ్డి, పైలట్​రోహిత్​రెడ్డితో బేరం
  • కోనుగోళ్ల కుట్రను భగ్నం చేసిన సైబరాబాద్​పోలీసులు
  • మునుగోడు ఉపఎన్నిక వేళ రాజకీయాల్లో సంచలనం
  • ప్రగతిభవన్​కు ఎమ్మెల్యేలు.. పోలీసుల అదుపులో స్వామిజీలు
  • వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించిన టీఆర్‌ఎస్‌

సామాజికసారథి, రంగారెడ్డి బ్యూరో: పార్టీ ఫిరాయింపునకు ఒక్కొక్కరికీ రూ.100 కోట్ల డీల్. అడ్వాన్స్ గా రూ.15 కోట్లు ఇవ్వాలన్నది ప్లాన్.. చివరికి వ్యూహం బెడిసికొట్టడంతో పోలీసులకు అడ్డంగా బుక్కాయ్యారు. టీఆర్ఎస్​కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కోనుగోలుచేసే కుట్ర కోణాన్ని బుధవారం రాత్రి తెలంగాణ పోలీసులు భగ్నం చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఓవైపు మునుగోడు ఉపఎన్నికలు హీట్​పుట్టిస్తుంటే అధికారపార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ఢిల్లీకి చెందిన స్వామిజీలు దూతలుగా వచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలుకు సిద్ధమయ్యారనే వార్త రాష్ర్టవ్యాప్తంగా దావానలంలా వ్యాపించింది. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్​మండలంలోని అజీజ్​నగర్​లో ఎమ్మెల్యే పైలట్​రోహిత్​రెడ్డికి చెందిన ఫాంహౌస్​లో ప్రభుత్వ విప్​లు​అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు, కొల్లాపూర్​ఎమ్మెల్యే హర్షవర్ధన్​రెడ్డి, తాండూర్​కు చెందిన పైలట్​రోహిత్​రెడ్డితో ఢిల్లీ నుంచి వచ్చిన పీఠాధిపతి రామచంద్రభారతి ఆలియాస్​సతీశ్​శర్మ, తిరుపతికి చెందిన సింహయాజీ, హైదరాబాద్​కు చెందిన వ్యాపారవేత్త నందుకుమార్​మధ్యవర్తిగా వ్యవహరించి పార్టీ ఫిరాయింపులకు సంబంధించి తమను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఎమ్మెల్యేలు తమకు సమాచారం ఇచ్చారని సైబరాబాద్​సీపీ స్టీఫెన్​రవీంద్ర తెలిపారు. ఎమ్మెల్యేల ఫిర్యాదు మేరకు తాము ఫాంహౌస్​పై దాడిచేసి ప్రలోభాలకు గురిచేసిన పీఠాధిపతి రామచంద్రభారతి, సింహయాజీ, వ్యాపారవేత్త నందకుమార్‌ అరెస్ట్​చేసినట్లు సీపీ వెల్లడించారు. ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు.

ప్రగతిభవన్​కు ఎమ్మెల్యేలు
ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగ కాంతారావు, హర్షవర్దన్​రెడ్డి కారులో ప్రగతిభవన్ కు వెళ్లారు. అనంతరం ఎమ్మెల్యే పైలట్​రోహిత్​రెడ్డి పోలీసు వాహనంలో ప్రగతిభవన్​కు చేరుకున్నారు. ఎమ్మెల్యేల కోనుగోలుకు సంబంధించి పట్టుబడిన డబ్బు వివరాలను సీపీ వెల్లడించలేదు. అయితే పాంహౌస్​లో రూ.15కోట్లు అడ్వాన్స్​గా తీసుకొచ్చారని ఎమ్మెల్యేలతో బేరసారాలు కుదిరిన తర్వాత రూ.100 కోట్లు చెల్లించేందుకు ఫాంహౌస్​కు తీసుకొచ్చారా? లేదా? అనేది సస్సెన్స్​గా మారింది. ఫాంహౌస్​నుంచి నోట్ల లెక్కింపు మిషన్లు, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎమ్మెల్యేలు కోనుగోళ్లకు సంబంధించి స్వామిజీలను తెలంగాణకు ఎవరు పంపించారు. ఎమ్మెల్యేలతో మంతనాలు ఎవరు జరిపారనే పూర్తి విషయాలు దర్యాప్తులో వెలుగులోకి రానున్నాయి.

ఎమ్మెల్యేల కొనుగోలుకు స్కెచ్?
అధికారపార్టీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగ కాంతారావు, పైలట్​రోహిత్​రెడ్డి, బీరం హర్షవర్దన్​రెడ్డి పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే ఒక్కొక్కరికి రూ.100 కోట్లతో పాటు కాంట్రాక్టులు, జాతీయస్థాయిలో పదవులను కట్టబెడతామని వారితో బేరసారాలు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో రాష్ర్ట ప్రభుత్వం సీరియస్​గా ఫోకస్ చేయడంతో బీజేపీ పార్టీ కుట్రలు బయటపడ్డాయని అధికారపార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు సంబంధించిన విషయాలను అధికారపార్టీ ఎమ్మెల్యేలు స్పందించారు. సీఎం కేసీఆర్​ఇటీవల ప్రకటించిన జాతీయ పార్టీ బీఆర్​ఎస్​ను అడ్డుకునేందుకు బీజేపీ.. అధికారపార్టీ ఎమ్మెల్యేలను కోనుగోలు చేసేందుకు సాహసం చేసినట్లు ఎమ్మెల్యే బాల్కసుమన్, వినయ్​భాస్కర్,​ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డి విమర్శించారు

బీజేపీ నేతలకు లింక్​లు ?
పోలీసులకు దొరికిపోయిన వారిలో దక్కన్‌ ప్రైడ్‌ హోటల్‌ యజమాని నందకుమార్‌ ఉన్నారు. ఆయన కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డికి అత్యంత సన్నిహితుడని సమాచారం. స్వామి రామచంద్రభారతి ఢిల్లీ నుంచి రాగా, సింహయాజులు తిరుపతికి చెందిన వారని పోలీసులు గుర్తించారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతో రైడ్‌ చేసినట్లు సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. డబ్బు, కాంట్రాక్టులు, ఇతర పదవులు ఇస్తామని ప్రలోభ పెడుతున్నట్లు ఎమ్మెల్యేలు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించారు. పట్టుబడిన వారిలో ఫరీదాబాద్‌కు చెందిన రామచంద్రభారతి అలియాస్‌ సతీశ్‌ శర్మ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపారని, ఆ సమయంలో తిరుపతి నుంచి వచ్చిన స్వామిజీ సింహయాజులు, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌ రామచంద్రభారతితో ఉన్నారని స్టీపెన్‌ రవీంద్ర వివరించారు. వారు ముగ్గురు ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నట్లు తెలిసిందన్నారు. ఈ వ్యవహారంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ పేర్కొన్నారు. అనంతరం ముగ్గురు నిందితులను విచారణ కోసం శంషాబాద్​డీసీపీ కార్యాలయానికి తరలించినట్లు సీపీ తెలిపారు.