సారథి, వేములవాడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న దళితబంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్, మాలమహానాడు, వీహెచ్పీ ఆధ్వర్యంలో చేస్తున్న దీక్షలు గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రెండో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. దళిత ముఖ్యమంత్రి చేస్తానని, ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తామని, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని చేసిన హామీలను విస్మరించారని మండిపడ్డారు. హుజూరాబాద్ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా మరోసారి కుట్రపూరితంగా దళితబంధు పథకాన్ని తీసుకొస్తున్నారని, గారడీ మాటలను నమ్మకూడదన్నారు. ఈనెల 30వ తేదీలోపు ప్రతి దళిత కుటుంబానికి రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్జిల్లా నాయకులు తాండ్రాల తిరుపతి, సుంకపాక దామోదర్ మాదిగ, వీహెచ్పీ జిల్లా కోకన్వీనర్ తలారి సురేష్, ఎమ్మార్పీఎస్మండల ఇన్చార్జ్ఎడపెల్లి నాగరాజు, ఎదురుగట్ల ఉపసర్పంచ్ లింగంపల్లి జానకి, ఎల్.ముత్తయ్య, హమ్మయ్య, ముక్కుస్వామి, జానీ, పద్మ, మణెమ్మ, చంద్రకళ, లక్ష్మీ పాల్గొన్నారు.
- August 12, 2021
- Top News
- daliathabandu
- huzurabad
- MRPS
- ఎమ్మార్పీఎస్
- దళితబంధు
- హుజూరాబాద్
- Comments Off on ‘హుజూరాబాద్ ఎన్నికల కోసమే ‘దళితబంధు’’