సారథి, తాడూరు: పథకానికి దరఖాస్తు చేసుకున్న ప్రతి లబ్ధిదారుడికి దళితబంధు సహాయం అందజేయాలని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు అంతటి కాశన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం నాగర్కర్నూల్ జిల్లా తాడూరు తహసీల్దార్ శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడి ఏడేళ్లు గడిచినా దళితుల అభ్యున్నతికి అరకొర నిధులు కేటాయిస్తూ మొండిచేయి చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితబంధు రూ.10లక్షల రుణసహాయం ప్రతి లబ్ధిదారుడికి ఇవ్వాలని కోరారు. ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాటలకే పరిమితమైందన్నారు. కార్యక్రమంలో పరశురాం, రాములు, కృష్ణ, చంద్రయ్య పాల్గొన్నారు.
- July 31, 2021
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- dalithabandhu
- KVPS
- TADUR
- కేవీపీపీఎస్
- తాడూరు
- దళితబంధు
- Comments Off on ప్రతి లబ్ధిదారుడికి దళితబంధు ఇవ్వాలి: కేవీపీఎస్