• ఒక పక్క హరితహారం పేరుతో మొక్కలు నాటితేమరో పక్క ఎలాంటి అనుమతి లేకుండానే చెట్ల నరికి వేత
• ఇది తెల్కపల్లి దవాఖాన ప్రాంగణంలో వెలుగు చూసిన సంఘటన
• చెట్ల నరికివేత పై పోలీస్ స్టేషన్ లో ఓ మహిళా ఫిర్యాదు
• ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని నేతల బెదిరింపు
సామాజిక సారధి ,నాగర్ కర్నూల్:
తెలంగాణ ప్రభుత్వం ఒక పక్క హరితహారం పేరు తో కోట్లు ఖర్చు పెట్టి మొక్కలు నాటితే.. అవి పెరిగి మానులు కాకముందే కళ్ళ ముందే నరికి విక్రయించుకుంటూ పబ్బం గడుపుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 20 ఏళ్ళ కింద నాటిన చెట్లను అటవీ శాఖ అధికారుల నుంచి కాని, సంబందించిన మెడికల్ ఆఫీసర్ నుంచి కాని ఏలాంటి ఆదేశాలు లేకుండానే ఆస్పత్రి ఆవరణలో ఉన్న మొత్తం చెట్లను నరికి విక్రయించేందుకు పునుకున్నారని స్థానిక పోలీస్ అధికారులకు ఇచ్చిన ఫిర్యాదు లో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి విచారించినట్లు విశ్వసనియా సమాచారం. ఆ అధికారి ఆస్పత్రినే సందర్శించకుంటే అక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్ ను బెదిరించి ఏమి చెప్పాపెట్టకుండా విక్రహించేవారు. అస్పత్రిలో వేల కొద్దీ జీతాలు తీసుకుంటూ ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు లో పేర్కొన్నట్లు తెలిసింది.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రవీందర్ రావు అనే వ్యక్తితో పాటు మరికొందరు ఇలాంటి వాటికి ముందు ఉండి ఆజ్యం పోస్తున్నారనేది పచ్చి నిజమని స్థానికులు వాపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి మొక్కలు నాటుతుంటే మరో పక్క చెట్లను నరకడమేమిటని ఆస్పత్రికి వస్తున్న రోగులు వాపోతున్నారు. అస్పత్రుల ఆవరణలో పచ్చన్ని చెట్లు ఉండాల్సింది పోయి డబ్బులకు కక్కుర్తి పడి నరికి అమ్ముకుంటున్నారని మండల ప్రజలు వాపోతున్నారు. నీడనిచ్చే చెట్లను నరికి అమ్ముకోవాలని చూస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.