Breaking News

పత్తి ధర రికార్డు బ్రేక్

పత్తి ధర రికార్డు బ్రేక్

సామాజిక సారథి, వరంగల్: మార్కెట్ లో పత్తి ధరలు మూడు రోజులుగా పెరిగిపోతుండటంతో రైతులు అనందం వ్యక్తం చేస్తున్నారు.  వరంగల్ జిల్లాలోని ఎనుమాముల మార్కెట్ లో పత్తి ధర క్వింటాలుకు ఈనెల 28న రూ.8,715 ధర నోమోదై, మార్కెట్ చరిత్రలో అత్యధిక రికార్డు నమోదు చేసింది. కాగా, బుధవారం పత్తి క్వింటాల్ కు రూ. 8,800లకు చేరుకుని, పాత రికార్డును బ్రేక్ చేసింది. మరోవైపు ఖమ్మం మార్కెట్ లో పత్తి ధర 9వేలు పలకింది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కు  వరుసగా మూడురోజులు సెలవులను అధికారులు ప్రకటించారు. తిరిగి జనవరి 3న మార్కెట్ ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.