- ఆధునిక వైద్యపరికరాల ఏర్పాటు
- ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు
సామాజిక సారథి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని నిమ్స్‌లో కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. నిమ్స్‌లో ఏర్పాటు చేసిన ఎండోస్కోపిక్ పరికరం, ఎంఆర్‌యూ ల్యాబ్, స్టెమ్ సెల్ రీసెర్చ్ ఫెసిలిటీ, ఫిజియోథెరపీ విభాగం, బోన్ డెన్సిటోవిూటర్, శాంపిల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టం, వాటర్ ఏటీఎంలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్ని విభాగాల హెచ్‌వోడీలతో మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రూ.12కోట్లతో వివిధ మెడికల్ పరికరాలను రోగులకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. జన్యుపర వ్యాధుల విశ్లేషణ, గుర్తింపునకు కొత్త ల్యాబ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నిమ్స్‌లో రూ.2.73 కోట్లతో న్యూమాటిక్ ట్యూబ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. రూ.40లక్షలతో అత్యాధునిక న్యూరో ఎండోస్కోపీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నిమ్స్‌లో అధనంగా 200 ఐసీయూ పడకలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రస్తుతానికి 155 ఐసీయూ పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు. కొత్త బెడ్లు జనవరి 15 నాటికి అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. నిమ్స్‌లో ప్రస్తుతం 89 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని, మరో 120 వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. నిమ్స్‌లో పరికరాల కోసం రూ.154 కోట్లు మంజూరు చేశామన్నారు. ఇక్కడ రూ.ఐదుకే భోజనం సరఫరా చేయాలని కోరారు. ఒమిక్రాన్ కేసులు తెలంగాణలో నమోదు కాలేదని స్పష్టం చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు.