సారథి, రామడుగు: అధికారులు, ప్రజాప్రతినిధులు జోడెడ్ల కచ్చురం లాగా సమన్వయంతో పనిచేయాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ సూచించారు. 45 ఏండ్లు నిండిన వారంతా విధిగా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని, ఆ బాధ్యతను ప్రజాప్రతినిధులు తీసుకోవాలని కోరారు. గురువారం కరీంనగర్ జిల్లా రామడుగు ఎంపీడీవో ఆఫీసులో ఎంపీపీ కల్గెటి కవిత అధ్యక్షతన జనరల్‌బాడీ సమావేశం నిర్వహించారు. కరోనా దృష్ట్యా ప్రజలు మాస్కులు ధరించాలని, శానిటైసర్లు వాడేలా ప్రజాప్రతినిధులు అధికారులు అవగాహన కల్పించాలని కోరారు. ప్రజలకు అందుబాటులో ఉంటు ప్రజాసమస్యల పరిష్కారానికి కృషిచేయాలన్నారు. పల్లె ప్రకృతి వనాల పట్ల శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలో హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించాలని ఆయా గ్రామ సర్పంచులను ఎంపీటీసీలను కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్గెటి కవిత, జడ్పీటీసీ మారుకొండ లక్ష్మీ, జడ్పీకోఆప్షన్ సుక్రోద్దీన్, మార్కెట్ కమిటీ చైర్మన్ గంట్ల వెంకట్ రెడ్డి, ఎంపీడీవో మల్హోత్రా, తహసీల్దార్కోమల్ రెడ్డి పాల్గొన్నారు.
- April 23, 2021
- Archive
- KARIMNAGAR
- MLA RAVISHANKAR
- RAMADUGU
- ఎమ్మెల్యే సుంకే రవిశంకర్
- కరీంనగర్
- రామడుగు
- Comments Off on కరోనా వ్యాక్సిన్ కచ్చితంగా తీసుకోవాలె