Breaking News

కరోనా వ్యాక్సినేషన్ ​షురూ

కరోనా వ్యాక్సినేషన్​షురూ

సారథి న్యూస్, ములుగు: జిల్లాలో మార్చి1వ తేదీ(సోమవారం) నుంచి రెండవ విడత కరోనా వాక్సినేషన్ ప్రారంభమవుతుందని ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణఆదిత్య తెలిపారు. ఆదివారం ఆయన సంబంధిత అధికారులు, వైద్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 60 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్​వేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు వైద్యుల ధ్రువీకరణ పత్రాలను తీసుకురావాలని కోరారు. ఆన్​లైన్​లో తమ పేరును cowin. gov. in వెబ్​సైట్​లో నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి శ్యాంసుందర్, డీఎంహెచ్​వో, వైద్యారోగ్య శాఖాధికారులు పాల్గొన్నారు.