సామాజిక సారథి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్లమెంటు సభ్యులు అనుముల రేవంత్ రెడ్డి గత రెండు రోజులుగా స్వల్ప జ్వరంతో బాధపడుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో అనుమానం వచ్చి కోవిడ్ టెస్టు చేసుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు ఆయన ట్వీట్ చేశారు. ఇటీవల రాష్ట్రంలోని జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జ్ లు, పలువురు ప్రజాప్రతినిధులు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గాంధీభవన్ తో పాటు ఆయన నివాసానికెళ్లి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్ అని తెలియగానే పార్టీ క్యాడర్ ఆందోళనలో పడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం రేవంత్ రెడ్డి హోమ్ కరెంట్ టైంలో ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో ఇటీవల కలిసిన పలువురు నేతలు కరోనా టెస్ట్ చేయించుకోవాలని తెలిపినట్లు సమాచారం.
- January 3, 2022
- Archive
- Top News
- లోకల్ న్యూస్
- హైదరాబాద్
- Comments Off on రేవంత్ రెడ్డికి కరోనా.. ఆందోళనలో క్యాడర్