సామాజికసారథి, నాగర్‌కర్నూల్ బ్యూరో: ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టు రానే వచ్చింది. 55 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ విడుదల చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ స్థానం నుంచి అందరూ భావించినట్లుగానే ఎమ్మెల్సీ నారాయణరెడ్డికి కాంగ్రెస్ టికెట్ వరించింది. నాగర్‌కర్నూల్ నుంచి మరో ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు డాక్టర్ కూచకుళ్ల రాజేశ్‌రెడ్డికి టికెట్ ను ఖరారు చేశారు. కొడంగల్ నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి బరిలోకి దిగబోతున్నారు. కొల్లాపూర్ నుంచి మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు, అలంపూర్ ఎస్ఏ సంపత్‌కుమార్, షాద్‌నగర్ శంకరయ్య, అచ్చంపేటలో డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సి.వంశీకృష్ణ మరోసారి టికెట్ ఇచ్చారు. గద్వాలలో సరిత అభ్యర్థిత్వాన్ని ఖరారుచేశారు.
నోట్: తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల వివరాలను కింద పేర్కొన్న పేజీలో చూడండి(ఏఐసీసీ అధికారిక విడుదల)