సారథి, పెద్దశంకరంపేట: పీసీసీ అధ్యక్షుడిగా ఏ.రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం నియమించడంతో ఆదివారం మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. స్థానిక గాంధీచౌరస్తా వద్ద టపాసులు కాల్చి ఉత్సవాలు చేసుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు రాజేందర్ గౌడ్, మధుసూదన్, ఎంపీటీసీ రాజు, కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షుడు జనార్ధన్, మధు, రాజేందర్ గౌడ్, జైహింద్ రెడ్డి, హరికిషన్, ఆయా గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
- June 28, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CONGRESS
- REVANTH REDDY
- కాంగ్రెస్
- తెలంగాణ
- పెద్దశంకరంపేట
- రేవంత్రెడ్డి
- Comments Off on రేవంత్ నియామకంతో కాంగ్రెస్ సంబురాలు