– మాదిగలకు టికెట్లు ఇవ్వని కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవు
– మాదిగలకు ఎక్కువ టికెట్లు కేటాయించిన పార్టీకే పూర్తి మద్దతు
– మాదిగ ఐక్యత వేదిక నాయకుడు మంగి విజయ్
సామాజికసారథి నాగర్కర్నూల్ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న మూడు ఎస్సి రిజర్వుడ్ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ కేవలం మాలలకు మాత్రమే టికెట్లు కేటాయించి ఎస్సీలలో జనాభా అధిక సంఖ్యలో ఉన్న మాదిగలకు తీవ్ర అన్యాయం చేస్తుందని ఈ టికెట్ల కేటాయింపు విషయంలో కాంగ్రెస్ పార్టీ పునరాలోచించుకోకపోతే తీవ్ర నష్టం జరుగుతుందని ఇప్పటికైనా నాగర్కర్నూల్ పార్లమెంటు స్థానానికి అధిక సంఖ్యలో మాదిగ లు ఉన్న ఈ నియోజకవర్గంలో మాదిగ అభ్యర్థికే టికెట్ కేటాయించాలని మాదిగల ఐక్యత వేదిక నాయకుడు మంగి విజయ్ డిమాండ్ చేశారు. శుక్రవారం నాగర్ కర్నూల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఉన్నత స్థాయి వ్యక్తి నుంచి కిందిస్థాయి వరకు మాదిగలకు తీవ్ర అన్యాయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున కరిగే మాల అయినందున కింది స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో టికెట్లు కేవలం మాలల కేటాయించాలని అధిక సంఖ్యలో ఎస్సీలలో ఉన్న మాదిగలకు టికెట్లు ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేస్తుందని ఈ విధంగా చేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మాదిగలు తగిన బుద్ధి చెప్తారని కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో పుట్టగతులు ఉండవని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏ పార్టీ అయితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అధిక సంఖ్యలో మాదిగలకు టికెట్లు కేటాయిస్తుందో వారికే తమ మద్దతు ఉంటుందని ఇప్పటికైనా నాగర్ కర్నూల్ నియోజకవర్గం వ్యాప్తిగా దాదాపు 3 లక్షలకు పైగా ఉన్న మాదిగల జనాభా ఆధారంగా నాగర్కర్నూల్ పార్లమెంట్ టికెట్ ప్రస్తుతం కేటాయించుకున్న మాల అభ్యర్థి మల్లు రవికి కాకుండా మాదిగ అభ్యర్థులకు ఎవరికైనా కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.