Breaking News

గాంధీ సాక్షిగా చెబుతున్నా కందనూల్ లో కాంగ్రెస్ జెండా ఎగర వేస్తా

సామాజిక సారధి , నాగర్ కర్నూల్ బ్యూరో : గాంధీజీ సాక్షి చెప్తున్నా కందనూల్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ రాజేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు . సోమవారం అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి గాంధీ విగ్రహం వరకు కాంగ్రెస్ కార్యకర్తల ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ చేశారు . జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జండా ఆవిష్కరణ కార్యక్రమానికి పాల్గొని , గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు .

ఈ సందర్భంగా వారు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ గాంధీజీ కన్న కలలు స్వేచ్ఛ స్వాతంత్రం నాగర్ కర్నూల్ నియోజకవర్గ ప్రజలకు కరువైందని , స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి గాంధీజీ లాంటి మహా నేత తెచ్చిన స్వాతంత్రం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు కరువైందని అన్నారు . ముఖ్యంగా నాగర్కర్నూల్ నియోజకవర్గంలో సామాన్య ప్రజలపై అక్రమ కేసులు , దౌర్జన్యాలు , దాడులు , క జ్జాలు జరుగుతున్నాయని ఇలాంటి చర్యలను రూపు లేకుండా చేయాలంటే నాగర్ కర్నూల్ లో ఈసారి జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు . తెలంగాణ రాష్ట్రంలోని మరో స్వతంత్ర పోరాటానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని జరగబోయే ఎన్నికలలో ఇక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసేందుకు ప్రతి ఒక్కరు సైనికులుగా పనిచేయాలని పిలుపునిచ్చారు . వారి వెంట డాక్టర్ శశిధర్ రెడ్డి , అర్థం రవి , కౌన్సిలర్ శ్రీనివాసులు , వెంకట్ స్వామి , కృష్ణారెడ్డి , అమృత్ రెడ్డి , దేవరకొండ రామచందర్ , బాలరాజు , శ్రీనివాస్ రెడ్డి , పాపి రెడ్డి తదితరులు ఉన్నారు .