Breaking News

ప్రచారంలో దూసుకు వెళ్తున్న కాంగ్రెస్ అభ్యర్థి

  • రాజకీయాలకు కొత్తైన ప్రజలను ఆకట్టుకుంటున్న యువనేత స్పీచ్ లు
  • ఇప్పటికే నియోజకవర్గంలో అన్ని గ్రామాలు చుట్టేసిన కాంగ్రెస్ అభ్యర్థి కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
  • హ్యాట్రిక్ విజయానికి గండి కొట్టేలా వ్యూహం

సామాజిక సారథి, నాగర్ కర్నూల్ బ్యూరో : అయిదారు నెలల క్రితం ఆ నేత అంటే నియో జకవర్గంలో 90 శాతం మంది ప్రజానీ కానికి తెలియదు అభ్యర్థి తండ్రి ప్రస్తుత ఎమ్మెల్సీ అయినప్పటికీ మూడు దశాబ్దాలుగా నాగర్ కర్నూల్ చరిత్రలో ఆయన తెలియని వారు ఉండరు సౌమ్యనిగా పేరు ఉన్న ఆయన తన కుటుంబాన్ని రాజకీయాల ఎన్నడూ వైపు తీసుకురాలేదు .మూడు దశాబ్దాలుగా నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే విజయం సాధించాలన్న తన కోరికను తన కుమారుని ద్వారానైనా నెరవేర్చుకోవాలన్న తపనతో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తన పెద్ద కుమారుడు రాజేష్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ తరపున అనూహ్యంగా టికెట్ ఇప్పించారు. గత ఆరు నెలలుగా ఆయన నియోజక వర్గంలో తన పార్టీ కార్యకర్తలు తన తండ్రి వెంట ఉన్న క్యాడర్ ను వెంట తిప్పుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ అభ్యర్థిగా ఆయనను ప్రకటించడంతో అంతకుముందు వరకు ఉన్న నాగర్ కర్నూల్ ప్రచారం లో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూచుకుళ్ల రాజేష్ రెడ్డి(ఫైల్) జనార్దన్ రెడ్డి ని సైతం బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని ఎ న్నిక ల ఎన్నికల ప్రచారం కోసం మర్రి జనార్దన్ రెడ్డి విని లెక్కలు యోగించుకుంటున్నారు.

యువనేత కావడంతో ఆసక్తి

తారుమార య్యాయి ఉమ్మడి మ హ బూ బ్నగర్ జిల్లాలోనే టిఆర్ఎస్ మొట్ట మొదటిగా గెలిచే స్థానంగా చెప్పుకున్న నాగర్ కర్నూల్ ను రాజేష్ రెడ్డి రాకతో పరిణామాలని ఒక్కసారిగా మారిపో యాయి అప్పటివరకు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి విజయం నల్లేరుపై నడకే అనుకున్న వారంతా ప్రస్తుతం నాగర్ కర్నూల్ లో మర్రి జనార్దన్ రెడ్డి గెలుస్తాడా అనే అంతగా మారిపోయాయి ఏకంగా తనకు బద్ద శత్రువు అయిన మాజీ మంత్రి నాగం రాజకీయాల్లోకి యువత రావాలని అందరూ పిలుపు నిస్తుంటారు కానీ దానిని పాటించేవారు ఎవరు ఉండరు వచ్చిన వారికి చాలా వరకు అడ్డంకులు ఎదురవుతుంటాయి అలాంటిది కాంగ్రెస్ పార్టీ నాగ ర్కర్నూల్ నియోజకవర్గ అభ్యర్థిగా యువనేత రాజేష్ రెడ్డి ని ప్రకటించడంతో యువత కూడా చాలా వరకు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు ఒకవైపు నిరు ద్యోగ సమస్య ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు నిరుద్యోగుల నుంచి గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు నియో జకవర్గంలో కీలకంగా ద్విముఖ పోరే ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

తొలి విడత ప్రచారం పూర్తి

నాగర్ కర్నూల్ నియోజకవర్గం లో కాంగ్రెస్ అభ్యర్థి లో రాజేష్ రెడ్డి ఇప్పటికే గడపగడపకు కాంగ్రెస్ పేరిట నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో తొలి విడత ప్రచారాన్ని పూర్తిచేసి మలివిడత ప్రచారాన్ని కూడా ప్రారంభించారు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో రాజేష్ రెడ్డి విజయవంతం అయ్యారని చెప్పవచ్చు ముఖ్యంగా గత పది సంవత్సరాలుగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వెంట ఉన్న కీలక నాయకులు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నడంతో అధికార పార్టీకి పెద్ద షాక్ అనే చెప్పవచ్చు ఎన్నికల సమయం నాటికి ఇంకా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వెంట ఉన్న కీలక నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది దీంతో గత కొద్ది కాలంగా హ్యాట్రిక్ విజయం కొట్టి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మంత్రిని అవుతా నంటూ చెప్పుకున్న తాను ప్రస్తుతం గెలుస్తానా అనే స్థాయికి దిగజారి తన వెంట ఉన్న కార్యకర్తల నీడను కూడా నమ్మలేని స్థితిలో ఉన్నాడు. నియోజకవర్గంలో తన వెంట నడిచిన కీలక నేతల వెంట షాడో టీంలను ఏర్పాటు చేసి వాళ్ళ కదలికలను ఎప్పటికప్పుడు తెలు సుకుంటూ పార్టీ వదిలి వెళ్లకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న ప్రతినిత్యం టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కాంగ్రెస్లో చేరుతూ వస్తున్నారు.

ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకొనేలా

నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రాజేష్ రెడ్డి ప్రభుత్వ వ్యతిరేకతను పూర్తిస్థాయిలో క్యాష్ చేసుకునేలా తన ప్రసంగాలను కొనసాగిస్తు న్నాడు గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇచ్చిన సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ 6 గ్యారంటీలను కూడా కొనసాగిస్తామని చెప్తున్నారు అదేవిధంగా గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ గాలికి వదిలేసిన హామీలను ప్రజలకు గుర్తు చేస్తూ ప్రజలను తన వైపు తిప్పుకునేలా చేస్తున్నారు.