బిజినపల్లిలో ఏడాదికి రెండుసార్లు ముఠా సభ్యుల నిర్వహo సామాజిక సారధి , బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం లో ఐదుగురు వ్యక్తులు ముఠా సభ్యులు గా ఏర్పాడి ఏడాదికి రెండుసార్లు విహార యాత్రల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న సంఘటనలు మండల వ్యాప్తంగా చర్చనీయంగా మారింది . గత 10 రోజుల నుండి మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులలో భాగంగా కాంట్రాక్టర్లు పనులు చేస్తున్న సంఘటన స్థలానికి వెళ్లి విహారయాత్ర పేరు చెప్పి డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది . ఈ ఐదుగురు ముఠా సభ్యులు గత పది సంవత్సరాల నుండి ఏడాదికి రెండుసార్లు ప్రజా ప్రతినిధుల దగ్గరికి , మండల స్థాయి అధికారుల దగ్గరికి వెళ్లి విహారయాత్ర పేర్లు చెప్పి డబ్బులు తీసుకునే వారిని వారిపై గతంలో కూడా పత్రికలలో వారిపై కథనాలు వచ్చిన ఎలాంటి చర్యలు లేనందునే , ఈ పది రోజుల నుండి కాంట్రాక్టర్లపై కన్నేసి వారు చేస్తున్న పనుల సంఘటన దగ్గరికి వెళ్లి విహారయాత్రల పేరుతో వేలాది రూపాయలు వసూలు చేసి యాత్రకు వెళ్లిన సంఘటన తెలిసిన ప్రజాప్రతినిధులకు వీరి వ్యవహారశీలిపై అసహ్యించుకుంటున్నారు . ఈ ముఠా సభ్యులు తెల్లవారితే సరి ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధుల దగ్గరికి వెళుతున్నప్పుడు వీరిని చూసి ఆ ప్రజాప్రతినిధులు జోబులు సరి చూసుకుంటున్నారని , ఈ ముఠా సభ్యులకు మండలంలో అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేత అండదండలు ఉండడం వల్లనే వీరు ఇలా వసూల్ చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి .
- July 18, 2023
- Archive
- Top News
- TELANGANA
- తెలంగాణ
- Comments Off on విహారయాత్ర పేరుతో డబ్బులు వసూలు …