- సీఎం స్టాలిన్ కొత్త స్కీం
- 762.23 కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
చెన్నై : పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం తమిళనాడు సీఎం స్టాలిన్ మరో కొత్త పథకం ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా వధువు కుటుంబానికి ఆర్థిక సహాయమే కాదు.. ఎనిమిది గ్రాముల బంగారు కాసుని అందజేయనున్నారు. 94,700 వేల మందికి పైగా అమ్మాయిల మ్యారేజ్ కు.. ఏకంగా 762.23 కోట్లు కేటాయించింది తమిళనాడు ప్రభుత్వం. అలాగే రిటైర్డ్ పురోహితుల పింఛన్ పథకాన్ని కూడా ప్రారంభించారు. గతంలో 3000 ఉన్న పురోహితుల పింఛను నాలుగు వేలకు పెంచారు. దీంతో తమిళనాడులో ఉన్న 1804 మంది పురోహితులు లబ్ధి పొందనున్నారు.