Breaking News

ఆపదలో అండగా సీఎం సహాయనిధి

ఆపదలో అండగా సీఎం సహాయ నిధి

సామాజికసారథి, తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చెన్నారం పంచాయతీలో బుధవారం బొడియ్యతండాకు చెందిన రాత్లావత్ బిందుకు చెన్నారం గ్రామానికి చెందిన హరిత కొండలచారి, ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సహకారంతో మంజూరైన రాత్లావత్ బిందుకు రూ.11వేలు, హరితకు రూ.14,500 వేలు సీఎంఆర్ఎఫ్ చెక్కును ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ స్వప్నభాస్కర్ రెడ్డి, చుక్కపూర్ ఎంపీటీసీ నాలాపురం వందన, రైతు గ్రామ కమిటీ అధ్యక్షుడు గుమకొండ మల్ రెడ్డి, చెన్నారం టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు రాములు, తిప్పిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, వార్డ్ మెంబర్ రమేష్ నాయక్, నాయకులు అశోక్ రెడ్డి, రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు

చెక్కు అందజేస్తున్న నాయకులు