సామాజిక సారథి, వాజేడు : ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. మిర్చి మొక్కజొన్న తదితర పంటలు వేసిన రైతులు ఈ వర్షంతో తీవ్ర నష్టాన్ని చవి చూశారు. శుక్రవారం మండల పరిధిలోని ఆరుగుంటపల్లిలో కురిసిన అకాల వర్షానికి మిర్చి పంట నేలకొరిగింది. రాళ్ల వర్షం పడడంతో వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. దీంతో స్థానిక రైతులు లబోదిబోమంటున్నారు. లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
- January 15, 2022
- Archive
- Top News
- లోకల్ న్యూస్
- Comments Off on అకాల వర్షంతో మిర్చి నష్టం