సామాజిక సారథి , నాగర్ కర్నూల్: ముఖ్యమంత్రి కేసీఆర్ అసమర్థత అవినీతి వల్లే ఎంతో సమర్థవంతంగా నిర్వహించవలసిన పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకేజీలు కావడంతో వేలాది మంది నిరుద్యోగులు మనోవేదనకు గురవుతున్నారని అసమర్ధ ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ నేత నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు . గురువారం జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1969 తొలి తెలంగాణ ఉద్యమంలో 369 మంది పోలీసుల తూటాలకు బలి అయ్యారని , అనంతరం జరిగిన మలిదశ ఉద్యమంలో వేలాదిమంది నీళ్లు , నిధులు , నియామకాల కోసం తమ ప్రాణాలను త్యాగం చేసి రాష్ట్రాన్ని సాధించుకుంటే అధికారంలోకి వచ్చిన కేసీఆర్ అమరవీరుల త్యాగాలను పక్కనపెట్టి దోచుకోవడం దాచుకోవడం ఎన్నికల్లో ఖర్చు పెట్టి గెలవడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రుల అవినీతి అక్రమాలు సంబంధించిన చిట్ట ఈడి వద్ద ఉందని వెంటనే వారిపై విచారణ జరిపించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు . ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతుందని మండిపడుతూ వెంటనే ప్రశ్నాపత్రాల లీకేజీ పై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు . అవినీతి అక్రమాలకు అడ్డాగా మారిన బిఆర్ఎస్ పార్టీని రాబోయే ఎన్నికల్లో ఓడించాలని కోరారు . ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి , జిల్లా ప్రధాన కార్యదర్శి అర్థం రవి , తెలకపల్లి జడ్పిటిసి సుమిత్ర , నాయకులు బాలగౌడ్ , తిమ్మాజీపేట పాండు తదితరులు పాల్గొన్నారు
- March 16, 2023
- Archive
- Top News
- మహబూబ్నగర్
- TELANGANA
- తెలంగాణ
- Comments Off on ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి… మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి