✓బిజినపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఇంచార్జీ ఎంపీడీఓ ఇష్టారాజ్యం
✓ తన ఛాంబర్ లోనే మహిళా ఉద్యోగి తో సరసాలు
✓ తన టేబుల్ వద్దే ఆ మహిళా కు కుర్చీ ఏర్పాటు
✓ఎంపీడీఓ ఛాంబర్ లోకి వెళ్లాలంటేనే జంకుతున్న సిబ్బంది, ప్రజాప్రతినిధులు
✓చోద్యం చూస్తున్న జిల్లా ఉన్నతాధికారులు
సామాజిక సారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఇంచార్జీ ఎంపీడీఓ కృష్ణ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ మండలానికి రెగ్యులర్ ఎంపీడీఓ లేకపోవడం, ఒక వేళ ఎవరైనా వచ్చినా వాళ్లను ఇక్కడ డ్యూటీ చేయకుండానే ఏదోరకంగా వేదించి ఇక్కడి నుంచి పంపించడం పరిపాటిగా మారింది. దీంతో ఈ కార్యాలయంలో సూపరింటెండెంట్ గా ఉన్న కృష్ణ కు ఇంచార్జీ ఎంపీడీఓ బాధ్యతలు అప్పగించారు. ఇంచార్జీ ఎంపీడీఓ బాధ్యతలు నిర్వహిస్తున్న కృష్ణ మాత్రం గవర్నమెంట్ ఆఫీస్ అన్న ఇంగితజ్ఞానాన్ని మరిచిపోయి తనకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తుండడాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఇంచార్జీ ఎంపీడీఓ గా తాను ఏం చేసినా చెల్లుతుందన్న ధీమాతో ఏకంగా ఇదే కార్యాలయంలో ఈజీఎస్ లో పని చేస్తున్న ఓ మహిళ ఉద్యోగి గా పనిచేస్తున్న ఓ మహిళా తో సరసాలు మొదలు పెట్టారు . గత కొంత కాలంగా అంతేకాకుండా రూల్స్ కు విరుద్దంగా సదరు మహిళా ఈజీఎస్ సెక్షన్ లో పనిచేయాల్సీ ఉన్నా 24 గంటలు తన వద్దే ఉంచుకోవడం కోసం ఏకంగా ఎంపీడీఓ ఛాంబర్ లో నే తనకు ఎదురుగా ప్రత్యేకంగా కుర్చి ని ఏర్పాటు చేయడం విశేషం.
గవర్నమెంట్ ఆఫీస్ అన్న సంగతి మరిచిపోయి తన గెస్ట్ హౌస్ లాగా ఫీల్ అవుతూ సదరు మహిళా తో నిరంతరం చనువుగా ఉండడం, సరసాలు ఆడడం, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుండడం చూసి కొందరు గతంలో ఫొటో లు తీశారు .. వీరు ఏదైనా గ్రామాల కు వెలినపుడు అందరి ముందే వారి ప్రవర్తన చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. వివిధ పనుల నిమిత్తం సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ పనుల నిమిత్తం టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఇలా ఎంతో మంది ఎంపీడీఓ ఛాంబర్ లోకి రావాల్సీ ఉంది. కాని ఈ ఛాంబర్లో ఈ ఇధ్దరు అధికారులు ఏ పోజిషన్ లో ఉన్నారో అర్థంకాక ఎంపీడీఓ ఛాంబర్ లోకి వెళ్లేందుకే జంకుతున్నారు.తప్పని పరిస్థితుల్లో ఎలాగోలా తమ పనులు ముగించుకొని బయటపడుతున్నారు. సుమారు గత ఏడాదిన్నర కాలంగా బిజినపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో రెగ్యులర్ ఎంపీడీఓ లేకపోవడం, ఇంచార్జీ బాధ్యతలు ఇతనికి అప్పగించడంతో ఆయన ఆడిందే ఆట.. పాడిందే పాటగా ఈ కార్యాలయం తయారైంది. నాగర్ కర్నూల్ జిల్లాలోనే అత్యధిక గ్రామ పంచాయతీలు ఉన్న మండలంగా ఉన్న బిజినపల్లి కి రెగ్యులర్ ఎంపీడీఓ నియమించకపోవడం తో ఇంచార్జీ ఎంపీడీఓ ఆగడాలకు అడ్డుఅదుపూ లేకుండా పోతోంది. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ ఎంపీడీఓ కార్యాలయంలో జరుగుతున్న వ్యవహారాన్ని జిల్లా అధికారులు సైతం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పుడైతే ఆ మహిళ ఉద్యోగి సెలువు పెట్టిందో అప్పటి నుంచి ఆ కార్యాల సిబ్బంది ఉప్పిరి పిలుచుకున్న రు . మళ్లీ ఆ మహిళ ఉద్యోగి వస్తె ఈ కార్యాల యం లో ఇంకా ఎలాంటి చిత్రాలు చూడాలో అని పలువురు గుస గుస లడుతనరు.
పొలిటికల్ లీడర్ల అండతో -బిజినపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న కృష్ణ వివిధ పొలిటికల్ పార్టీల నాయకులకు విధేయుడిగా ఉంటూ వాళ్ల పనులు చేసి పెడుతుండడంతో ఎవ్వరు తనను పట్టించుకోరన్న ధీమాతో కొనసాగుతున్నారు. మండలంలోని గ్రామాల అభివృద్దిలో కీలకంగా ఉండే ఎంపీడీఓ స్థాయి అధికారి ఏడాదిగా లేకపోయినా అటు అధికారులు , ఇటు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం మానేశారు. దీంతో ఇంచార్జీ బాధ్యతలతో ఎంపీడీఓ సీటు పై కూర్చున్న ఈయన తనకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఓ వైపు ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో గ్రామాల్లో వివిధ అభివృద్ది పనులు వేగంగా జరుగుతుండడంతో పర్యవేక్షణ చేసే అధికారి లేకపోవడం బిజినపల్లి మండలానికి శాపంగా మారింది. మండలంలోని పొలిటికల్ లీడర్లు మాత్రం తాము చేసే నాణ్యత లేని పనులను ప్రశ్నించకుండా అడిగిన చోట సంతకాలు పెట్టి బిల్లులు మంజూరు చేస్తే చాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఇంచార్జీ బాధ్యతలతో ఇష్టం వచ్చినట్లు నాణ్యతలేని పనులకు బిల్లులు మంజూరు చేస్తుండడంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి బిజినపల్లి మండలానికి రెగ్యులర్ ఎంపీడీఓ ను నియమించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఇంచార్జీ ఎంపీడీఓ పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.