Breaking News

‘ఉపాధి’పై సామాజిక తనిఖీ

‘ఉపాధి’పై సామాజిక తనిఖీ

సారథి, రామయంపేట: ఉమ్మడి రామయంపేట మండలంలోని పలు గ్రామాల్లో 2018 నుంచి 2021 వరకు జరిగిన రూ 8 కోట్ల 76 లక్షల ఉపాధిహామీ పనుల రికార్డులను శుక్రవారం నిజాంపేట మండలకేంద్రంలో ఆడిట్​చేశారు. ఈ సందర్భంగా డీఆర్డీవో శ్రీనివాస్ మాట్లాడుతూ సోషల్ ఆడిట్ జూలై 16 నుంచి 30 వరకు జరిగిందని దీనిలో భాగంగా మాస్టర్స్ వేరిఫికేషన్, ఎంబీ రికార్డ్స్ వేరిఫికేషన్, కూలీలకు సక్రమంగా పేమెంట్స్ జరుగుతున్నాయా లేదా? అనే అంశాలపై రిప్రజెంట్ చేశారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఏపీడీ బాలయ్య, అసిస్టెంట్ డీవీవో సంపత్, ఎస్ ఆర్.పి అంజాగౌడ్, నిజాంపేట ఎంపీడీవో ఆఫీస్ సిబ్బంది, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, విలేజ్ సెక్రటరీలు పాల్గొన్నారు.


​​​​​​​​​​​​​​​​​​​​​​​​