- రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
- మొదటి దశలో రూ.859 కోట్లతో అభివృద్ధి
- ఫీవర్ ఆస్పత్రి వద్ద నాలగోడ నిర్మాణానికి శంకుస్థాపన
సామాజిక సారథి, హైదరాబాద్: భాగ్యనగరంలో నాలాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. స్ట్రాటజిక్ నాలా డెవలప్ మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఫీవర్ ఆస్పత్రి వద్ద రక్షణ గోడ నిర్మాణానికి ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మొదటి దశలో రూ.859 కోట్లతో నాలాల అభివృద్ధి చేపడుతున్నట్లు పేర్కొన్నారు. హుస్సేన్ సాగర్ వరదనీటి నాలా.. రక్షణ గోడ నిర్మాణానికి రూ.68.4 కోట్లు అవుతుందని ప్రభుత్వం వేసినట్లు తెలిపారు. గతేడాది వర్షాలకు హుస్సేన్‌సాగర్ సర్ ప్లస్ నాలా పొంగడంతో, ప్రజలంతా ఇబ్బందులు పడ్డారని, దీంతో 12 కి.మీ రక్షణ గోడ నిర్మించి నాలాల సమస్యకు చెక్ పెడతామన్నారు. గత ఏడాది హైదరాబాద్ లో కుంభవృష్టి వర్షం కురవడతో అశోక్ నగర్, గోల్నాక పరిసరాలు నీటి మునిగాయని ఆవేదన్య వ్యక్తం చేశారు. వచ్చే వర్ష కాలం నాటికి నాలల పరిసరాల్లో జరుగుతున్న పనులు పూర్తి చేస్తామని చెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 633 కోట్లు, బల్దియా పరిసర మున్సిపాలిటీలు, కార్పొరేషన్ పరిధిలో నాల డెవెలప్ మెంట్ కోసం రూ.225.32 కోట్లు, మీర్పేట్ పరిధిలో 45.62 కోట్లు, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 23.94 కోట్లు, జల్పల్లి పరిధిలో24.85 కోట్లు, పెద్ద అంబర్పేట్ పరిధిలో 32.42 కోట్లు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 84 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చెపట్టబోతున్నట్లు ఆయన
తెలిపారు.