బీఎస్పీ కల్వకుర్తి ఇన్చార్జ్ కొమ్ము శ్రీనివాస్ యాదవ్
సామాజికసారథి, కడ్తాల్: కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి గిరిజన ఆశ్రమ పాఠశాలలో సరస్వతి విగ్రహా ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా సాగింది. హైస్కూలు హెచ్ఎం విజయ, ఎల్ఐసీ రిటైర్డ్ ఆఫీసర్ తౌర్యానాయక్తమ సొంత ఖర్చులతో ఏర్పాటుచేశారు. ముఖ్యఅతిథులుగా ఎంపీపీ కమ్లీ నాయక్, జడ్పీటీసీ దశరథ్ నాయక్, బీఎస్పీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్ము శ్రీనివాస్ యాదవ్, ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ చందన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొమ్ము శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. పేదల విద్యార్థులకు మరింత నాణ్యమైన అందించాలని కోరారు. చదువుతోనే భవిష్యత్మారుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. అనంతరం టెన్త్క్లాస్లో 10/10 మార్కులు సాధించిన పవన్నాయక్ తదితర విద్యార్థులను సత్కరించారు. సరస్వతి దేవీ విగ్రహాన్ని ఏర్పాటుచేసిన హెచ్ఎం విజయ ఫ్యామిలీని శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రామకృష్ణ, రంగారెడ్డి డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్ గుప్తా, గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.