Breaking News

రేవంత్ రెడ్డి పర్యటనలో మార్పు

రేవంత్ రెడ్డి పర్యటనలో మార్పు

సామాజిక సారథి, శాయంపేట: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రచ్చబండ కార్యక్రమంలో భాగంగా పీసీసీ చీప్ రేవంత్ రెడ్డి ఈనెల30వ తేదీన జయశంకర్ భూపాలపల్లి జిల్లా శాయంపేట మండలానికి రానున్న సంగతి తెలిసిందే. అయితే అనివార్య కారణాలతో ఈ నెల 31కి కార్యాక్రమాన్ని మార్చినట్లు భూపాలపల్లి ఇన్ చార్జి గండ్ర సత్యనారాయణ తెలిపారు. నాయకులు మారిన తేదీని దృష్టిలో ఉంచుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.