సారథి న్యూస్, వాజేడు: ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆఫీసర్ల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని బర్తరఫ్ చేయాలని ఎమ్మార్పీఎస్ వాజేడు మండల ఇన్చార్జ్ వావిలాల స్వామివారి గవర్నర్ను కోరారు. ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షుడు అరికిల్ల వేణుమాదిగ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారతర్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు. కులాలను బట్టి సమర్థులు, అసమర్థులుగా అంచనా వేయడం తన మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. ఈనెల 15న మంగపేట మండలంలో జరిగే ఎమ్మార్పీఎస్ జిల్లాస్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు ఆదినారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నం స్వామి, ఉపాధ్యక్షుడు పొడపాటి సత్యనారాయణ పాల్గొన్నారు.
- February 3, 2021
- Archive
- లోకల్ న్యూస్
- వరంగల్
- షార్ట్ న్యూస్
- BR AMBEDKAR
- MLA DHARMAREDDY
- MRPS
- PARAKALA
- ఎమ్మార్పీఎస్
- ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
- పరకాల
- బీఆర్ అంబేద్కర్
- Comments Off on ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని బర్తరఫ్ చేయాలి