Breaking News

సీడీఎస్‌ జనరల్​ బిపిన్​రావత్ కన్నుమూత

సీడీఎస్‌ జనరల్​బిపిన్​రావత్ కన్నుమూత
  • హెలిక్యాప్టర్ ​ప్రమాదంలో 13 మంది దుర్మరణం
  • మృతుల్లో బిపిన్​రావత్​ దంపతులు
  • తమిళనాడులోని వెల్లింగ్టన్‌లో మిలిటరీ కాలేజీకి వెళ్తుండగా దుర్ఘటన

న్యూఢిల్లీ: చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ తో పాటు ఆయన సతీమణి మధులిక రావత్ హెలిక్యాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయయారు. వారు ప్రయాణిస్తున్న ఎంఐ 17 వీ5 ఆర్మీ హెలికాప్టర్‌ బుధవారం తమిళనాడులోని కూనూరు సమీపంలో కుప్పకూలిపోయింది. సమయంలో అందులో ఆర్మీ చీఫ్​తో పాటు ఆయన సతీమణి మధులికా రావత్, బ్రిగేడియర్‌ ఎల్‌ఎస్‌ లిడ్డర్‌, లెప్టినెంట్‌ కల్నల్‌ హర్జిందర్‌ సింగ్‌, నాయక్‌ గుర్‌సేవక్‌ సింగ్‌, నాయక్‌ జితేందర్‌ కుమార్‌, లాన్స్‌ నాయక్‌ వివేక్‌ కుమార్‌, లాన్స్‌ నాయక్‌ బి.సాయితేజ, హవల్దార్‌ సత్పాల్‌తో ఉన్నారు. ఈ ప్రమాదంలో 13 మంది చనిపోయినట్లు భారత వాయుసేన ప్రకటించింది. సీడీఎస్‌ చీఫ్​ జనరల్‌ బిపిన్‌ రావత్‌ వెల్లింగ్టన్‌లో మిలిటరీ కాలేజీలో లెక్చర్‌ ఇచ్చేందుకు బుధవారం ఉదయం 9 గంటలకు ఢిల్లీలోని ప్రత్యేక విమానంలో తమిళనాడుకు బయలుదేరివెళ్లారు. ఉదయం 11.35 గంటల సమయంలో సూలూరు ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో ల్యాండ్‌ అయింది. అక్కడి నుంచి వీరంతా ఎంఐ-17వీ5ఎఫ్‌ హెలికాప్టర్‌లో వెల్లింగ్టన్‌కు బయలుదేరివెళ్లారు. వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్‌ సర్వీస్‌ కాలేజీలో లెక్చర్‌ ఇచ్చేందుకు రావత్‌ బయలుదేరారు. మార్గమధ్యంలో మధ్యాహ్నం 12.20 గంటల ప్రాంతంలో కట్టేరీలోని నంచప్పచత్రం ప్రాంతంలో వీరు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కూలిపోయింది. అటవీ ప్రాంతంలో చెట్టుపై కూలడంతో ఒక్కసారిగా భీకరమైన మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో హెలిక్యాప్టర్​లో ఉన్నవారు చనిపోయారు.