సామాజిక సారధి , నాగర్ కర్నూల్ బ్యూరో : ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి అనుచరుడు నాగ నూలు. కృష్ణారెడ్డి పై నాగర్ కర్నూల్ పోలీసులు కేసు నమోదు చేశారు . గురువారం తెల్లవారుజామున ఆరు గంటలకు కృష్ణారెడ్డి ఇంటి దగ్గరికి వెళ్లిన పోలీసులు మీపై కేసు ఉన్నదని పోలీస్ స్టేషన్ కు రావాలని తీసుకు వచ్చినట్లు తెలిసింది . నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పై కృష్ణారెడ్డి అసభ్యంగా కించపరిచే విధంగా మాట్లాడినట్లు ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసినట్లు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు . పోలీసులు ఎమ్మెల్సీ అనుచరుని స్టేషన్కు తరలించిన విషయం కాంగ్రెస్ కార్యకర్తలకు తెలియడంతో అందరూ స్టేషన్కు వెళ్లేందుకు సిద్ధం కాగా కృష్ణారెడ్డిని పోలీసులు విడిచిపెట్టినట్లు తెలిపారు . ఈ విషయంపై కృష్ణారెడ్డిని సామాజిక సారధి ప్రతినిధి అడగగా నాపై పోలీస్ స్టేషన్లో కేసు ఉన్నదని తీసుకొని వెళ్లి అక్కడ ఉన్న ఎస్ఐ నన్ను చేతులతో చెంప దెబ్బ కొట్టాడని , ఎమ్మెల్యేని విమర్శిస్తావురా అంటూ అసభ్య పదాచాలాలతో దూషించాడని అంతేకాకుండా నాపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతానని బెదిరించాడని తెలిపాడు . ఇట్టి విషయంపై ఎస్సై నీ ఫోన్లో వివరణ కోరగా కృష్ణారెడ్డి పై కేసు నమోదు ఉన్నందుకే స్టేషన్కు తీసుకొచ్చాము తప్ప నేను ఎవరిని కొట్టలేదని జవాబు చెప్పాడు .
- July 20, 2023
- Archive
- Top News
- TELANGANA
- తెలంగాణ
- Comments Off on ఎమ్మెల్సీ అనుచరుడిపై కేసు నమోదు