‘అర్జున్‌రెడ్డి’, ‘గోత గోవిందం’ వంటి బ్లాక్బాస్టర్తో మస్త్పాపులారిటీ సంపాదించుకున్న రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినాకైఫ్ నటించనుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇన్‌స్టాగ్రామ్‌లో కత్రినా.. విజయ్‌ని ఫాలో అవుతోంది. ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్ట్ కూడా అందుకు సంకేతమని అనిపిస్తోంది. ‘న్యూ డే.. న్యూ హెయిర్ కట్.. న్యూ ఫిలిమ్’ అంటూ కత్రినాపెట్టిన పోస్ట్ విజయ్ సినిమా గురించే అని అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
ఇదిలాఉండగా, ఇప్పటికే ఫుల్షెడ్యూల్ తో బిజీ అయిన క్రేజీ స్టార్విజయ్ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో ‘లైగర్’ అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అనన్యపాండే హీరోయిన్‌గా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా, సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ‘లైగర్’ పూర్తయిన తర్వాత కత్రినాకైఫ్ తో నటించే సినిమా షెడ్యూల్ప్రారంభమవుతుందని సినీవర్గాలు చెబుతున్నాయి.