సారథి, రాయికల్: ఆపద సమయంలో ఓ యువకుడు గొప్ప మనస్సు చాటాడు. రక్తదానం చేసి మానవతను చూపాడు. కరీంనగర్ జిల్లా రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన కంచి సాయన్నకు అత్యవసరంగా ‘ఏ’పాజిటివ్ రక్తం అవసరం కావడంతో దావన్ పల్లి గ్రామానికి చెందిన బీజేపీ ఎస్సీ మోర్చా మండలాధ్యక్షుడు చెలిమెల మల్లేశంను సంప్రదించాడు. సదరు యువకుడు మానవత్వంతో స్పందించి జగిత్యాల హాస్పిటల్ కు వెళ్లి రక్తదానం చేశాడు. ఇప్పటివరకు తాను 11సార్లు రక్తదానం చేసినట్లు చెప్పాడు. ఈ సందర్భంగా ఆయనను హాస్పిటల్ సిబ్బంది, బాధిత కుటుంబసభ్యులు, పలువురు అభినందించారు.
- May 8, 2021
- Archive
- కరీంనగర్
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- BJP
- BLOOD DONATION
- KARIMNAGAR
- raykal
- కరీంనగర్
- బీజేపీ
- రక్తదానం
- రాయికల్
- Comments Off on బీజేపీ ఎస్సీ మోర్చా నేత ఔదార్యం