- ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి తప్పదు
- సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా
హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఆర్‌ఎస్‌ఎస్ నడుపుతోందని, స్టీరింగ్ వారిచేతుల్లోనే ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా ఆరోపించారు. శనివారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేస్తారని, ఇది 2024 సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపుతుందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడాలంటే ప్రతిపక్షాల పాత్ర కీలకం కాబోతోందన్నారు. సెక్యులర్శక్తులన్నీ ఏకం కావాల్సిన సమయం వచ్చిందని, అందరూ ఒక తాటిపైకి రావాలని రాజా పిలుపునిచ్చారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని అన్నారు. వ్యవసాయ చట్టాలపై రైతుల పోరాటం వలనే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చిందని ఆయన గుర్తుచేశారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యుడు సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు ఎం.బాల్ నరసింహా తదితరులు పాల్గొన్నారు.