Breaking News

అనంతపురంలో బర్డ్​ ఫ్లూ కలకలం

అనంతపురంలో బర్డ్​ఫ్లూ కలకలం

సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల: పక్షులు, కోళ్లను బర్డ్​ఫ్లూ మహమ్మారి కబళిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పౌల్ట్రీ రైతులను వణికిస్తోంది. క్రమంగా దక్షిణాది రాష్ట్రాలకు కూడా బర్డ్​ఫ్లూ మహమ్మారి పాకినట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా, జోగుళాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం అనంతపురం గ్రామంలో ఉన్నట్టుండి 20 నుంచి 30 నాటుకోళ్లు ఒకేరోజు చనిపోవడం కలకలం రేపింది. ఈ కోళ్లకు బర్డ్​ఫ్లూ వచ్చిందా? మరేదైనా కారణమా? అని బాధిత పెంపకందారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు కోళ్లను పరిశీలించి.. చుట్టుపక్కల గ్రామాల్లో కోళ్ల పెంపకందారులకు జాగ్రత్తలు తెలియజేయాలని పలువురు కోరుతున్నారు.

చనిపోయిన కోళ్లను చూపుతున్న గ్రామస్తులు