# ఖానాపూర్ లో ఖాళీ అయిన బిఆర్ఎస్ పార్టీ
# 500 మందికి పైగా కాంగ్రెస్ లో చేరిక
సామాజిక సారధి , బిజినేపల్లి : ఎన్నికలు సమీపిస్తున్న తక్కువ రోజులలో బిజినపల్లి మండల పరిధిలోని ఖానాపూర్ , మాన్యతాండ లో బిఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది . ఆదివారం మండల పరిధిలోని పాలెం శ్రీ బాలాజీ ఫంక్షన్ హాల్ లో బిఆర్ఎస్ పార్టీ నుండి ఖానాపురం గ్రామంలో మత్స్య కార్మిక సంఘం నాయకులు బంగారయ్య ఆధ్వర్యంలో 300 మంది కార్యకర్తలు , మాన్యతాండ లో 200 మంది బిఆర్ఎస్ కార్యకర్తలు , పాలెం మైనార్టీ నాయకులు , వివిధ గ్రామాల నుండి వచ్చిన బిజెపి పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలోకి భారీగా కార్యకర్తలు డాక్టర్ రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు .
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 40 రోజులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేస్తే ఐదు సంవత్సరాల పాటు ప్రజలంతా సంతోషాలతో ఉంటారని అందుకోసమే ప్రతి కార్యకర్త సైనికుడిగా పని చేయాలని వారు కోరారు . ఇప్పటికే చాలా గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు ఉన్న వారిపైన అక్రమ కేసులు , బెదిరింపులు , దాడులు చేస్తున్నారని వీటి అన్నిటికీ ముగింపు ఇచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కార్యకర్తలు ఎవరు కూడా భయపడకుండా గ్రామాలలో బీఆర్ఎస్ రాక్షస పాలన గురించి చైతన్యపరచి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలని అన్నారు .
ఇక్కడ ఎమ్మెల్యే ప్రవర్తన వల్ల ప్రతి గ్రామంలో కార్యకర్తలు కేసులతో సతమతమవుతూ అనేక కష్టాల పడ్డ సంగతి తెలిసిందేనని ఇప్పటికైనా బిఆర్ఎస్ పార్టీని విడిచి కాంగ్రెస్ పార్టీలో చేరాలని వారు తెలిపారు . మీకు అండగా నేనుంటాను మీరు ధైర్యంగా గ్రామాలలోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ స్కీం లను ప్రజలకు తెలియజేయాలని కోరారు .