సారథి, నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ఖరారైంది. టీఆర్ఎస్‌లో ఎన్నో ట్విస్ట్ ల మధ్య నోముల భగత్ కు టికెట్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి.. అభ్యర్థిని ప్రకటించడంతో పాటు వెంటనే బీ ఫామ్ కూడా అందజేయడంతో ఉత్కంఠతకు తెరతీసినట్లయింది. నర్సింహాయ్య కుటుంబానికి బాసటగా నిలుస్తానన్న హామీ మేరకు ఆయన కుమారుడికి టికెట్ కేటాయించారు. ఇక కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత కె.జానారెడ్డి అభ్యర్థిత్వం ఎప్పుడో ఖరారైంది. ఇప్పటికే నియోజకవర్గంలో తనదైన శైలిలో ప్రచారంలో ముందంజలో ఉన్నారు. జానారెడ్డికి అజాతశత్రువుగా పేరుంది. బీజేపీ అభ్యర్థిగా ప్రముఖ వైద్యుడు, గిరిజన నేత, డాక్టర్ పానుగోతు రవికుమార్ కు టికెట్ ఇచ్చారు. ఆయన వృత్తిరీత్యా ప్రభుత్వ వైద్యుడు. త్రిపురాం మండలం పలుగుతండాకు చెందిన ఆయన పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సివిల్ సర్జన్ గా సేవలందించారు. నిర్మల ఫౌండేషన్ ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టికెట్ల లొల్లి సద్దుమణిగినట్లే.. సమరంలో విజయం ఎవరిదో వేచిచూడాలి.
- March 30, 2021
- Archive
- Top News
- పొలిటికల్
- janareddy
- NAGARJUNASAGAR
- nomula bhagath
- జానారెడ్డి
- నాగార్జునసాగర్
- నోముల భగత్
- బీజేపీ
- Comments Off on నాగార్జునసాగర్ లో నువ్వా.. నేనా?