సారథి, మానవపాడు(గద్వాల): జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రాష్ట్రప్రభుత్వం నూతనంగా ఏర్పాటుచేసిన తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ ను వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎంపీ రాములు బుధవారం ప్రారంభించారు. పేదలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా ప్రభుత్వ ఆస్పత్రులకు రావాలని కోరారు. సర్కారు దవాఖానల్లో అన్నిరకాల వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కరోనాకు మెరుగైన వైద్యచికిత్సలు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ శృతిఓఝా, ఎస్పీ రంజన్ రతన్ కుమార్, డీఎంహెచ్ వో చంద్రనాయక్, జడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, వీఎం అబ్రహం, జడ్పీ వైస్ చైర్మన్ సరోజ, గద్వాల, అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్లు రామేశ్వరమ్మ, పటేల్ విఘ్ణవర్ధన్ రెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ బీఎస్ కేశవ్, జడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.
- June 10, 2021
- Archive
- DIAGNOSTIC CENTER
- GADWALA
- TELANGANA
- గద్వాల
- డయాగ్నోస్టిక్ సెంటర్
- తెలంగాణ
- మంత్రి నిరంజన్ రెడ్డి
- Comments Off on పేదలకు చెంతనే మెరుగైన వైద్యసేవలు