సారథి న్యూస్, వెల్దండ: కరోనా విజృంభిస్తుండగా, లాక్ డౌన్ సమయంలో ప్రజలకు అందించిన సేవలకు గాను నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ తహసీల్దార్ జి.సైదులుకు ఉత్తమ అధికారి అవార్డు దక్కింది. మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో కలెక్టర్ ఎల్.శర్మన్, జడ్పీ చైర్పర్సన్ పద్మావతి చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. కాగా, లాక్‌డౌన్‌ను మండల వ్యాప్తంగా ఆయన పకడ్బందీగా అమలుచేశారు. కరోనా బాధితులను గుర్తించి, వారికి చికిత్స అందించడంలో కిందిస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయడం, కోవిడ్ 19 వ్యాప్తి చెందకుండా ఊరూరా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంలోనూ విశేషంగా కృషి చేశారు. ఈ క్రమంలోనే తహసీల్దార్ జి.సైదులును బెస్ట్ ఆఫీసర్ గా గుర్తించారు. అవార్డు అందుకున్న సందర్భంగా ఆయనకు కిందిస్థాయి సిబ్బంది, పలువురు ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు.
- January 26, 2021
- Archive
- మహబూబ్‌నగర్
- లోకల్ న్యూస్
- NAGARKURNOOL
- REPUBLIC DAY
- VELDANDA
- ఉత్తమ అవార్డు
- నాగర్‌కర్నూల్
- రిపబ్లిక్‌డే
- వెల్దండ
- Comments Off on వెల్దండ తహసీల్దార్‌కు ఉత్తమ అవార్డు