సారథి న్యూస్, చిన్నశంకరంపేట: రైతులు ఒకే రకం పంట పండించకుండా పంట మార్పిడి నేర్చుకోవాలని మెదక్ జిల్లా చిన్నశంకరంపేట వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రైతులకు సూచించారు. బుధవారం గవ్వలపల్లిలో రైతువేదికలో అపరాలు, నూనెగింజల పంటలపై రైతులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. రైతులకు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం రైతులకు విత్తనాలను పంపిణీచేశారు. మెదక్ జిల్లాలో మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి చేతుల మీదుగా మొట్టమొదటి రైతు వేదికను ప్రారంభించడంతో పాటు, మొట్టమొదటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకునే వెసులుబాటు మండలానికి దక్కటం పట్ల రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పట్లోరి రాజు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, అంజి రెడ్డి, యాదవరావు, బందెల ప్రభాకర్, బాగారెడ్డి, వ్యవసాయ విస్తరణాధికారులు,తదితరులు పాల్గొన్నారు.
- February 3, 2021
- Archive
- మెదక్
- HARISHRAO
- medak
- RYTHUVEDIKA
- చిన్నశంకరంపేట
- పంట మార్పిడి
- మెదక్
- రైతు వేదిక
- Comments Off on పంట మార్పిడితో రైతులకు మేలు