సారథి, రామాయంపేట: గ్రామాల్లో వర్షాకాలంలో డయేరియా లాంటి విషజ్వరాలు ప్రబలకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి సూచించారు. గురువారం ఆమె మండలంలోని జెడ్ చెర్వు గ్రామంలో రూ.35 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీరోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పల్లెప్రగతి ప్రోగ్రామ్ ద్వారా సీఎం కేసీఆర్ గ్రామాలను బాగుచేయడం కోసం అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారని వివరించారు. యాసంగిలో పండిన వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు గవర్నమెంట్ కొనుగోలు చేసి రైతుల ఖాతాలో జమచేస్తున్నదని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో నిజాంపేట జడ్పీటీసీ విజయ్ కుమార్, ఎంపీపీ, గ్రామ సర్పంచ్ అరుణ్ కుమార్, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
- June 24, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- diarrhea
- medak
- mla padma devendarreddy
- RAMAYAMPET
- డయేరియా
- మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి
- రామాయంపేట
- Comments Off on డయేరియా పట్ల జాగ్రత్తగా ఉండాలే