- నాగర్ కర్నూల్ లో వింతగా పోలీసు అధికారుల ప్రవర్తన
- కంప్లైంట్ చేసిన వారిని పోలీస్ స్టేషన్కు పిలిచి కొట్టిన వైనం
- ఆలేరులో పైసలు పంచుతుండగా పట్టుబడిన టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బై కాని శ్రీనివాస్ యాదవ్ , మరి జనార్దన్ రెడ్డి తనయుడు
- కాపాడి మరి ఇంటికి పంపిన పోలీసులు
- పోలీస్ ల తీరుపై ఎస్పీ కీ పిర్యాదు చేసినా రాజేశ్ రెడ్డి
సామాజిక సారధి , నాగర్ కర్నూల్ బ్యూరో :ఎన్నికల ప్రచారం ముగిసి మరో 12 గంటలలో ఎన్నికలు జరగనున్న వేళ జిల్లాలో ప్రలోభాల పర్వం విపరీతంగా సాగుతుంది . అధికార పార్టీ విచ్చలవిడిగా డబ్బు , మద్యం పంపిణీ చేస్తుంది . వీటిని కట్టడి చేసేందుకు ప్రతిపక్ష పార్టీల నాయకులు అధికార పార్టీ నాయకులను పట్టుకుని పోలీసులకు ఎలక్షన్ కమిషన్ అధికారులకు ఫిర్యాదు చేయగా వారు తిరిగి ఫిర్యాదు చేసిన వారిని పోలీస్ స్టేషన్లకు పిలిచి మరి వారి జులుం చూపిస్తున్నారు . మరోవైపు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మర్రి జనార్దన్ రెడ్డి షాపింగ్ మాల్స్ కు సంబంధించిన ఉద్యోగులు యదేచ్చగా పైసలు పంపిణీ చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ నిజాముద్దీన్ పోలీస్ లకు ఫిర్యాదు చేసి ఇతర నియోజకవర్గ ప్రజలకు ఇక్కడ ఏమి పని అని వారి పైసలను పట్టుకొని వీడియోలు తీసి పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారిని పంపించేసి అతనిపై పోలీస్ స్టేషన్కు పిలిచి స్థానిక సీఐ జూలు చూయించారు . మరోవైపు తెలకపల్లి మండలం ఆలేరు గ్రామ పరిధిలో టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బై కాని శ్రీనివాస్ యాదవ్ మర్రి జనార్దన్ రెడ్డి తనయుడు శశిధర్ రెడ్డి పైసలు పంచుచుండగా స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు పట్టుకొని వీడియోలు తీస్తుంటే పోలీసులు వచ్చి కాంగ్రెస్ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేశారు .
టిఆర్ఎస్ పైసలను కనీసం సీజ్ చేయకుండా , కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి చేయడం ఏమిటని రాజేశ్ రెడ్డి ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు . మరోవైపు ఎలక్షన్ కమిషన్ అధికారులకు ఫిర్యాదు చేసిన దీనిపై ఎలాంటి స్పందన ఉండడం లేదు . పాలెం గ్రామంలో పద్మశాలి గ్రూపులో మర్రి జనార్దన్ రెడ్డి తమ సంక్షేమం కోసం పది లక్షల రూపాయలు ఇచ్చారని కావున అందరూ మర్రి జనార్దన్ రెడ్డికి ఓటు వేయాలని బహిరంగ ప్రచారం చేస్తుండడం గత వారం రోజుల క్రితమే సామాజిక సారధి జిల్లాలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగడం అనుమానమేనని చెప్పుతుండడం ప్రస్తుతం అలాగే జరుగుతుండడంతో పోలీసుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి .