.. ఆస్పత్రి ఆవరణలో నిద్రిస్తున్న బాలికపట్ల ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు.
.. రోగుల బంధువులు ప్రతికటించి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగింత
సామాజిక సారథి, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. తన తల్లి ప్రసవం కోసం వస్తే వెంట వచ్చిన బాలిక నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి అగంతకుడు అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకోగా శనివారం ఉదయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలకపల్లి మండలం లోని ఓ గ్రామానికి చెందిన గర్భిణీ ప్రసవం కోసం గురువారం జనరల్ ఆస్పత్రిలో చేరింది. కాగా తన వెంట వచ్చిన భర్త తన కూతురు అదే ఆసుపత్రిలో నిద్రించారు. నాగర్ కర్నూల్ మండలం గగ్గలపల్లి గ్రామానికి చెందిన మయతి బాబు (42) నిద్రిస్తున్న బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు వెంటనే తీరుకొని కేకలు వేయడంతో పక్కనే ఉన్న తండ్రి, స్థానికులు నిద్రలేచి నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. వెంటనే డయల్ హండ్రెడ్ ద్వారా చేయడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయడంలో తాత్సారం చేస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.