సామాజిక సారథి, నాగర్ కర్నూల్: రాష్ట్రంలో అణువణువునా ముఖ్య మంత్రి కేసీఆర్ కనిపిస్తున్నారని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. సోమవారం తూడుకుర్తి, నాగర్ కర్నూల్, తెలకపల్లి మండలంలోని నడిగడ్డ గ్రామాల్లో నిర్వహించిన రైతుబంధు సంబరాల్లో జడ్పీ చైర్ పర్సన్ పద్మావతి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి హాజరయ్యారు. అంతకుముందు ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లతో నిర్వహించిన ర్యాలీలో వారు పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మొక్కలో, గింజలో, నీటిలో, కరెంటులో ప్రతి చోటా కేసీఆర్ కనిపిస్తున్నారన్నారు. ఒక్క రైతుబంధు పథకం కిందనే ఇప్పటి వరకు రూ.50,600 కోట్లు రైతుల ఖాతాలలో జమ చేసినట్లు వెల్లడించారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోనే 8 విడతలుగా రూ.82,639 మంది రైతులకు రూ.728 కోట్ల రూపాయలు అందాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
- January 11, 2022
- Archive
- Top News
- లోకల్ న్యూస్
- Comments Off on అణువణువూ కేసీఆరే..