హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యక్తిగత అనుచరుడిగా పనిచేసి ఆయన ఆత్మగా పేరొందిన సూరీడుపై అతని అల్లుడు సురేంద్రనాథ్‌రెడ్డి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలోకి ప్రవేశించి క్రికెట్ బ్యాట్‌తో దాడికి దిగాడు. గతేడాది కూడా సురేంద్రనాథ్ సూరీడుపై దాడికి తెగబడ్డాడు. భార్యను వేధింపులకు గురి చేస్తుండడంతో గతంలో సురేంద్రనాథ్‌పై గృహహింస కేసు నమోదైంది. ఈ కేసును ఉపసంహరించుకోవాలని సూరీడుపై సురేంద్రనాథ్ ఒత్తిడి తీసుకొస్తున్నాడు. కేసును ఉపసంహరించుకోకపోవడంతో కక్షతో మామను హత్యచేసేందుకు యత్నించాడు. సూరీడు కూతురు గంగాభవానీ ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి, సురేంద్రనాథ్‌ను అరెస్టు చేశారు.
- March 24, 2021
- Archive
- Top News
- క్రైమ్
- JUBLIHILLS
- surudu
- YSR
- జూబ్లీహిల్స్
- వైఎస్ రాజశేఖర్‌రెడ్డి
- వైఎస్సార్
- సూరీడు
- Comments Off on సూరీడుపై హత్యాయత్నం