-తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కమిటీ సభ్యుడు కందికొండ మోహన్
సామాజిక సారథి , నాగర్ కర్నూల్: ప్రముఖ జర్నలిస్ట్ సతీష్ చందర్ తో పాటు, జర్నలిజం కళాశాల కరస్పాండెంట్ గౌరీ , కవి జయరాజు ఇతర మేధావులను అప్రజా స్వామీక పద్ధతిలో అరెస్టు చేయడం సరైనది కాదని వారిని వెంటనే వారిని విడుదల చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. ఈ సందర్బంగా జర్నలిస్ట్ మోహన్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం, మనుధర్మ శాస్త్రం గురించి వివరించడానికి ముఖ్య వక్తగా హాజరై భారత రాజ్యాంగం గురించి వివరించి మనుధర్మ శాస్త్రంలో ఉన్న మంచి చెడులను వివరించాడా ని , కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనుధర్మ శాస్త్రం అవలంబింబించిన చెడులను చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ బాధ్యత భుజాన వేసుకున్న మేధావులను సరైంది కాదని వారిని విడుదల చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రభుత్వాన్ని స్థానిక పోలీసులను డిమాండు చేస్తుంది .
- February 19, 2023
- Archive
- Top News
- మహబూబ్నగర్
- ముఖ్యమైన వార్తలు
- TELANGANA
- తెలంగాణ
- Comments Off on జర్నలిస్టు సతీష్ చందర్ ను అరెస్టు చేయడం అప్రజా స్వామికం