న్యూఢిలీ: దేశంలోని అనేక రాష్ట్రాలకూ గవర్నర్లను మార్చేశారు. మహారాష్ట్ర కొత్త గవర్నర్గా రమేశ్ బైస్ ను నియమించారు ప్రస్తుత గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆమోదించారు. మహారాష్ట్రతో పాటు ఆంధ్రప్రదేశ్ ను సైతం కొత్త గవర్నర్ ను నియమించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ను ఏపీ గవర్నర్ గా నియమించినట్లు రాష్ట్రపతి భవన్ ప్రతినిధి వెల్లడించారు. మరోవైపు, లద్దాఖ్ ఎల్జీగా ఉన్న ఆర్కే మాథుర్ రాజీనామాను ముర్ము ఆమోదించారు. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్న బ్రిగేడియర్ బీడీ మిశ్రాను ఆయన స్థానంలో నియమించారు. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గా లెఫ్టినెంట్ జనరల్ కైవాల్య త్రివిక్రమ్ పర్నాయక్, సిక్కిం గవర్నర్ గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ఝార్ఖండ్ గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్, అసోం గవర్నర్ గులాబ్ చంద్ కటారియా, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా శివ్ ప్రతాప్ ను నియమిస్తూ ప్రకటన విడుదల చేశారు. మణిపుర్ గవర్నర్ గా ఉన్న లా గణేశ్ ను నాగాలాండ్ గవర్నర్ గా బదిలీచేశారు. బిహార్ గవర్నర్ ఫాగు చౌహాన్ ను మేఘాలయా గవర్నర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. హిమాచల్ గవర్నర్ గా ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ను బిహార్ గవర్నర్ గా బదిలీచేశారు.
- February 12, 2023
- Archive
- Top News
- murmu
- NARENDRAMODI
- గవర్నర్లు
- ద్రౌపదిముర్ము
- బీజేపీ
- Comments Off on పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం