Breaking News

ఓ ఐడియా..!

ఓ ఐడియా..!

సారథి న్యూస్, ములుగు: చెదిరిన గూడుకు ప్రాణంపోశారు ఓ ఆఫీసర్. ఓ వినూత్న ఆలోచనతో వాటికి నీడ కల్పించారు. ములుగు జిల్లా ప్రేమ్ నగర్ కు చెందిన అటవీశాఖ పీఆర్వో సాయికిరణ్ ఇంటి ఆవరణలో పిచ్చుకలు గూడు పెట్టుకున్నాయి. గూడు బోర్ మోటర్ బోర్డు నుంచి కింద పడిపోవడంతో సాయికిరణ్​చలించిపోయారు. ఆ సమయంలో వినూత్నన ఆలోచన కలిగింది. వెంటనే పిచ్చుల కోసం ప్రత్యామ్నాయంగా ఏర్పాటుచేశారు. ఇంటి డాబా కింద అట్టలతో ఒక గూడును ఏర్పాటుచేశారు. ఆ గూడుకు రిబ్బను పూవును అమర్చి పిచ్చుకలను ఆకర్షించేలా సుందరీకరించారు. అలాగే పిచ్చుకల గూడు సమీపంలో మట్టి తొట్ట ఏర్పాటుచేసి నీళ్లు నింపారు. ప్రతిఒక్కరూ తమ ఇంటి ఆవరణలో పిచ్చుకల కోసం ఇలాంటి గూడును ఏర్పాటుచేయాలని సాయికిరణ్ ఆకాంక్షించారు.