Breaking News

యువతకు అల్లూరి ఆదర్శం

యువతకు అల్లూరి ఆదర్శం
  • కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి

సామాజికసారథి, హైదరాబాద్: నేటి యువత అల్లూరి సీతారామరాజు జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి పిలుపు ఇచ్చారు. ఆదివారం హైదరాబాద్ లో జూబ్లీహిల్స్​లోని ఫిల్మ్​నగర్​క్లబ్​లో క్షత్రీయ సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మన్యంవీరుడు అల్లూరి సీతారామారావు 125వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అల్లూరి మ్యూజియాలను లంబసింగిలో‌ రూ.35కోట్లు, హైదరాబాద్‌లో రూ.18కోట్లతో నిర్మిస్తున్నామని, వీలైనంత త్వరగా మ్యూజియాలను నిర్మించి జాతికి అంకితం చేయాలని రెండు ప్రభుత్వాలను కోరుతున్నానని అన్నారు. అల్లూరి సీతారామరాజు సినిమా ద్వారానే స్వాతంత్ర్య ఉద్యమం గురించి తెలుసుకున్నానని చెప్పారు. స్వాతంత్ర్య ఉద్యమంలో గుర్తింపు పొందని సమరయోధులను కేంద్రం గౌరవిస్తోందన్నారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జరగబోయే అల్లూరి సీతారామరాజు కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీని తీసుకురావడానికి ప్రయత్నిస్తానని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. తాను తాను స్వతహాగా సూపర్ స్టార్ కృష్ణ అభిమానినని, చిన్నప్పుడు ఆయన సినిమాలు ఎక్కువగా చూసేవాడినని గుర్తుచేశారు. అల్లూరి సీతారామరాజు సినిమాను నాలుగైదు సార్లుచూశానని తెలిపారు.  ఈనెల 13న అల్లూరి స్వగ్రామం మోగులును సందర్శిస్తానని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్, నటులు సూపర్​స్టార్​కృష్ణ, మోహన్​బాబు తదితరులు పాల్గొన్నారు.