Breaking News

గెస్ట్ లెక్చరర్ల సమస్యలను పరిష్కరించండిమంత్రి నిరంజన్ రెడ్డి కి గెస్ట్ లెక్చరర్ల వినతి

సామాజిక సారథి, వనపర్తి: రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో ఏళ్లుగా పనిచేస్తున్న 1654 మంది గెస్ట్ లెక్చరర్ల సమస్యలను పరిష్కరించాలని గెస్ట్ లెక్చరర్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని కోరారు. సోమవారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వనపర్తి జిల్లా గెస్ట్ లెక్చరర్లు మంత్రిని కలిసి తమ సమస్యలను వివరించారు. ఎన్నో ఏళ్లుగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో 1654 మంది గెస్ట్ లెక్చరర్లు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలనే నమ్ముకొని విధులు నిర్వహిస్తున్నామన్నారు. కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల మాదిరిగానే త్రిమెన్ కమిటీ ద్వారా ఎంపికై అడ్మీషన్లు, తరగతులు, స్పాట్ వాల్యూయేషన్ తదితర విధులు నిర్వహిస్తున్నామన్నారు. జూనియర్ కాలేజిల్లో రెగ్యులర్, కాంట్రాక్ట్ లెక్చరర్లతో సమానంగా పనిచేస్తున్నా గెస్ట్ లెక్చరర్లకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేదని, పీరియడ్ల పేరుతో చాలీచాలని జీతాలు ఇస్తున్నారన్నారు. గతేడాది పనిచేసిన జీతాలు సైతం ఇప్పటికి పెండింగ్ లో ఉన్నాయని గెస్ట్ లెక్చరర్లను శ్రమదోపిడికి గురిచేస్తున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గెస్ట్ లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించి, ప్రతి ఏటా ఆటో రెన్యూవల్ చేస్తూ 12 నెలల కన్సాలిడేషన్ పే చేయాలని మంత్రిని వేడుకున్నారు. గెస్ట్ లెక్చరర్ల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి నిరంజన్ రెడ్డి గెస్ట్ లెక్చరర్లకు హామినిచ్చారు. కార్యక్రమంలో గెస్ట్ లెక్చరర్లు బాలకృష్ణ గౌడ్, మాధవి, శివలీల, యుగంధర్, ఆనంద్, వనజ, శ్యామ్ పాల్గొన్నారు.