సారథి, అలంపూర్(మానవపాడు): జోగుళాంబ గద్వాల జిల్లా అడిషనల్ కలెక్టర్ రఘురామశర్మ బుధవారం అలంపూర్ జోగుళాంబ, బాలబ్రహ్మశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. అనంతరం స్థానిక తహసీల్దార్ ఆఫీసు నుంచి జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ధరణి వెబ్సైట్ నుంచి అందిన ఫిర్యాదులపై సలహాలు, సూచనలు ఇచ్చారు. అలాగే ఊట్కూర్ గ్రామ శివారులో ఉన్న ప్రభుత్వభూమిలో గతంలో లావాణీ పట్టాలు ఇచ్చినా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయకపోవడంతో రైతుల భూములను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ విషయమై సమగ్ర నివేదిక సమర్పించాలని తహసీల్దార్ ను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మదన్ మోహన్, నాయబ్ తహసీల్దార్ భూపాల్ రెడ్డి, సర్వేయర్ వెంకటలక్ష్మి, వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
- July 21, 2021
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- DHARANI
- GADWALA
- JOGULAMBA
- గద్వాల
- జోగుళాంబ
- ధరణి
- Comments Off on జోగుళాంబ సన్నిధిలో అడిషనల్ కలెక్టర్